About Us
మా ప్రయాణం – సేవా సంకల్పంతో విజయపథం
శ్రీ బండ లక్ష్మణ్ శర్మ గారు, మా వ్యవస్థాపకులు, అమెరికా హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రతిష్టాత్మకమైన USA PC అవార్డును పొందారు. వారు హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థలలో మాస్ట్రైనింగ్ ప్రోగ్రాములు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా 1.5 లక్షల మంది విద్యార్థులు మరియు 100కి పైగా సంస్థలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసారు.
ప్రతి విజయవంతమైన కార్యక్రమం మాకు మరింత సంకల్పబలాన్ని ఇచ్చింది. ఇప్పుడు మా సేవలు విద్యాసంస్థలకే పరిమితం కాకుండా, వివిధ సంస్థల ఉద్యోగులు మరియు యజమానుల వరకూ విస్తరించాయి. స్వయంసేవకులు మాతో చేరడం వల్ల, మేము తక్కువ సమయంలో ఎక్కువ మందిని చేరగలుగుతున్నాము.
మేం నమ్మిన మార్గదర్శి
ప్రొఫెసర్ కె. రామసుబ్రమణ్యం గారు, ఐటీ ప్రొఫెసర్ మరియు సీనియర్ సైంటిస్ట్. వారు 14 సంవత్సరాల పాటు వేదాలు చదివారు. ఆయనే మా గురువు. రైతుల అభివృద్ధి, శ్రేయస్సు కోసం పని చేయమని ఆయన మాకు ఉపదేశించారు. గత 20 సంవత్సరాలుగా ఆయన మార్గదర్శనంలో మేము సమాజ సేవ చేస్తున్నాము.
గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు భగవద్గీత బోధన
11 సంవత్సరాలుగా గోశాల నిర్వహణ
ఎస్పీకే సహజ వ్యవసాయం లో తలమునకలై ఉన్నాం

మా సాధనలు

125 ఆవులతో గోశాల నిర్వహణ

3 ఎకరాలలో ఎస్పీకే (సుభాష్ పాళేకర్) సహజ వ్యవసాయం

ప్రతి నెల రూ.1 లక్షకు పైగా ఆదాయం
మా దృష్టి మరియు లక్ష్యం

మా లక్ష్యం – 100 విజయవంతమైన రైతులను రూపొందించడమే కాదు, ప్రతి రైతు మరో 100 విజయవంతమైన రైతులను సృష్టించగల శక్తిని పొందాలి.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలి.
సమాజంలో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాలి –
“రైతు కూలీ కార్మికుడు కాదు… రైతు ఓ దేవుడు!”
We don’t just grow crops… We grow leaders in farming.